Shreyas Iyer: ముస్తాక్ అలీ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ వీరంగం.. సిక్సర్లు, ఫోర్లతో విధ్వంసం

  • 55 బంతుల్లో 147 పరుగులు
  • సిక్కిం బౌలర్లకు చుక్కలు చూపిన ముంబై యువ బ్యాట్స్‌మన్
  • టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు

టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ చెలరేగిపోయాడు. బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టించాడు. ఇండోర్‌లో జరుగుతున్న ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి రోజున సిక్కింతో జరిగిన టీ20లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. 55 బంతుల్లోనే 7 ఫోర్లు, 15 సిక్సర్లతో ఏకంగా 147 పరుగులు చేసి భారత్ తరపున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రిషభ్ పంత్ (128)ను అయ్యర్ అధిగమించి ఆ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

శ్రేయాస్ అయ్యర్ విజృంభణతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. అనంతరం 259 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సిక్కిం 104 పరుగులకే కుప్పకూలి పరాజయం పాలైంది.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News