Lagadapati Rajagopal: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: లగడపాటి

  • టీడీపీ మహిళా నేతను పరామర్శించిన లగడపాటి
  • తన పోటీపై వస్తున్నవన్నీ ఊహాగానాలేనన్న మాజీ ఎంపీ
  • తానే పార్టీ తరపునా పోటీ చేయడం లేదని స్పష్టీకరణ

రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమైన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇటీవల మళ్లీ చురుగ్గా కనిపిస్తున్నారు. దీంతో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

తాజాగా, ఈ ఊహాగానాలకు లగడపాటి తెరదించారు. తానే పార్టీలోనూ చేరబోవడం లేదని, వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. తన పోటీపై వస్తున్నవన్నీ ఊహాగానాలు మాత్రమేనని తెగేసి చెప్పారు. మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న జి.కొండూరు జడ్పీటీసీ మాజీ సభ్యురాలు, టీడీపీ మహిళా నేత దగ్గుమల్లి భారతి సహా మరికొందరిని గురువారం లగడపాటి పరామర్శించారు. ఈ సందర్బంగా వచ్చే ఎన్నికల్లో పోటీపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం ఇచ్చారు.

Lagadapati Rajagopal
Congress
Telugudesam
Elections
Andhra Pradesh
  • Loading...

More Telugu News