jana sena: ‘జనసేన’ ఆశావహులలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-d254b8305a65f76c7da9352f372b3d18990227ee.jpg)
- ఈరోజు స్క్రీనింగ్ కమిటీకి 150 బయోడేటాలు సమర్పణ
- తన బయోడేటా సమర్పించిన పసుపులేటి
- పాడేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న బాలరాజు
ఏపీలో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున టికెట్ ఆశించే వారి జాబితాలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పేరు కూడా చేరింది. విజయవాడలోని ‘జనసేన’ కార్యాలయంలోని స్క్రీనింగ్ కమిటీకి పసుపులేటి బాలరాజు తన బయోడేటాను సమర్పించారు. పాడేరు అసెంబ్లీ స్థానం నుంచి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా కోరారు.
కాగా, ఈరోజు మొత్తం 150 బయోడేటాలు స్క్రీనింగ్ కమిటీకి వచ్చాయి. ‘జనసేన’ ఆశావహులలో మైనార్టీ వర్గాలకు చెందిన ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు. గుంటూరు, కర్నూలు, కడప, నెల్లూరు, మదనపల్లె తదితర స్థానాల నుంచి అభ్యర్థిత్వం కోరుతూ వచ్చిన బయో డేటాల్లో పలువురు ముస్లింలు ఉన్నట్టు ‘జనసేన’ ఓ ప్రకటనలో తెలిపింది. గుంటూరు నుంచి వైద్యులైన ముస్లిం దంపతులు తమ బయో డేటాలు సమర్పించినట్టు పేర్కొంది.