Andhra Pradesh: అందుకు, ఎన్నో బలహీనతలు ఉన్న జగన్ ని పావుగా వాడుకుంటున్నారు: సీఎం చంద్రబాబు

  • ఏపీని సామంత రాజ్యం చేసుకోవాలని కుట్రలు
  • ఆస్తులున్న ఆంధ్రులను టీఆర్ఎస్ వేధిస్తోంది
  • హైదరాబాద్, ఢిల్లీ పాలకులే టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నారు

ఏపీని సామంత రాజ్యం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని, అందుకు, ఎన్నో బలహీనతలు ఉన్న జగన్ ని పావుగా వాడుకుంటున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. హైదరాబాద్, ఢిల్లీ పాలకులే టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆస్తులున్న ఆంధ్రులను టీఆర్ఎస్ వేధిస్తోందని, ఏపీ రాజకీయాల్లో తాము చెప్పినట్టుగా పని చేయాలని బెదిరిస్తున్నారని, ద్వితీయశ్రేణి టీడీపీ నేతల ఆస్తులపై మోదీ ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడమని, ఎదిరించి పోరాడతామని స్పష్టం చేశారు. వచ్చేటప్పుడు ఏమీ తెచ్చుకోలేదు, పోయేటప్పుడు తీసుకుపోమని, రాష్ట్ర విభజన ద్వారా ఆస్తులు పోయినా ఆత్మ గౌరవం కోసం పోరాడతామని అన్నారు.

Andhra Pradesh
Chandrababu
Jagan
YSRCP
Telugudesam
modi
bjp
it attacks
  • Loading...

More Telugu News