Andhra Pradesh: చంద్రబాబుకు ఎందుకింత అభద్రతాభావం!: వైసీపీ నేత సి.రామచంద్రయ్య

  • వైసీపీలోకి వలసలను చూసి బాబు భయపడుతున్నారు
  • జగన్ ని ఎవరైనా కలిస్తే ఆయనకు ఉలికిపాటెందుకు? 
  • చింతమనేనిపై చర్యలు తీసుకోరే?

వైసీపీలోకి వస్తున్న వలసలను చూసి సీఎం చంద్రబాబు భయపడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య విమర్శించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ ని ఎవరైనా కలిస్తే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారని, ఆయనకు ఎందుకింత అభద్రతాభావం అని అన్నారు.

తమ పార్టీలోకి వచ్చే వాళ్లు ముందుగా తమ పార్టీకి, పదవికి రాజీనామా చేసిన తర్వాతే వారిని తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దళితులపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి ఆయన మండిపడ్డారు. చింతమనేనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చంద్రబాబును ప్రశ్నించారు. ఈ సందర్బంగా చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న ఛానెళ్లపై ఆయన విమర్శలు చేశారు. పుల్వామాలో ఉగ్రవాదుల దాడి ఘటనకు ప్రధాని మోదీ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని కోరుతున్న చంద్రబాబు, నాడు రాజమండ్రి పుష్కరాల ఘటనకు బాధ్యత వహించారా? అని రామచంద్రయ్య ప్రశ్నించారు. 

Andhra Pradesh
cm
Chandrababu
YSRCP
c.ramachandraiah
jagan
chintamaneni
  • Loading...

More Telugu News