sidhu: పుల్వామా ఎఫెక్ట్.. సిద్ధూను బహిష్కరించిన సినీ ఫెడరేషన్
- స్టూడియోలలోకి అనుమతించరాదని నిర్ణయం
- పాకిస్థానీ ఆర్టిస్టులపై కూడా నిషేధం
- ఈరోజు జరిగిన సమావేశంలో ఫెడరేషన్ కీలక నిర్ణయం
పుల్వామా ఘటన నేపథ్యంలో పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సిద్ధూను బహిష్కరించింది. ఈ రోజు ముంబైలో జరిగిన సమావేశంలో ఫెడరేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ముంబైలోని స్టూడియోలలో సిద్ధూతో పాటు పాకిస్థానీ ఆర్టిస్టులను అనుమతించరాదని నిర్ణయించింది.
పుల్వామా ఘటన తర్వాత సిద్ధూ మాట్లాడుతూ, ఒక వ్యక్తి చేసిన పనికి ఒక దేశాన్ని మొత్తం నిందించడం సరికాదని అన్నారు. దీంతో, సిద్ధూపై విమర్శల వర్షం కురిసింది. 'ది కపిల్ శర్మ షో' నుంచి కూడా ఆయనను పక్కన పెట్టేశారు. తాజాగా ఆయనపై సినీ ఫెడరేషన్ బ్యాన్ విధించింది.