Andhra Pradesh: చింతమనేని పూర్తి ప్రసంగాన్ని జగన్ మీడియా ఎందుకు చూపించదు?: నారా లోకేశ్

  • దళితులను జగన్ రెచ్చగొడుతున్నారు
  • పదేపదే కుల ప్రస్తావన తీసుకురావడం తగదు
  • ఏపీని అస్థిరపరచాలని చూస్తున్నారు

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇటీవల చేసిన ప్రసంగంలో దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు, దళిత సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. చింతమనేని ప్రసంగాన్ని ఎడిట్ చేసి, కొద్ది భాగాన్నే వైరల్ చేస్తూ, వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, జగన్ తన మీడియా ద్వారా దళితులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

చింతమనేని పూర్తి ప్రసంగాన్ని జగన్ మీడియా ఎందుకు చూపించదు? అని ప్రశ్నించారు. చింతమనేని ప్రసంగానికి వారంతా చప్పట్లు, కేరింతలు కొట్టారని, ఎవరైనా తమను అవమానిస్తుంటే ఈవిధంగా చేస్తారా? అని ప్రశ్నించారు. పదేపదే కుల ప్రస్తావన తెస్తూ ఏపీని అస్థిరపరచాలని చూస్తున్నారని, టీడీపీని దెబ్బతీసేందుకు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం రాక్షసత్వమని జగన్ పై నిప్పులు చెరిగారు. ప్రజలకు వారి కుట్రలు అర్థమైన రోజున చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు.

Andhra Pradesh
Telugudesam
mla
chintamaneni
lokesh
YSRCP
Jagan
  • Loading...

More Telugu News