Andhra Pradesh: రైతు ప్రాణాలు కాపాడేందుకు తీసుకెళ్తున్న పోలీసులు ఎవరు? మోదీ పంపారా?: జగన్ కు లోకేశ్ సూటి ప్రశ్న

  • కోటయ్యను బీసీ రైతు అని జగన్ నొక్కి చెబుతున్నారు
  • మనిషి ప్రాణానికి కూడా కులాన్ని జత చేయడమా!
  • జగన్-మోదీ కుల రాజకీయం చేస్తున్నారు

గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్య మృతికి సీఎం చంద్రబాబు, పోలీసులే కారణమంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలను మంత్రి నారా లోకేశ్ ఖండించారు. జగన్ ని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా కొన ఊపిరితో ఉన్న కోటయ్యను మోసుకెళ్తున్న ఫొటోను పోస్ట్ చేశారు. జగన్-మోదీ కుల రాజకీయం చేస్తున్నారని, కోటయ్యను బీసీ రైతు అని నొక్కి చెబుతున్న జగన్, మనిషి ప్రాణానికి కూడా కులాన్ని జత చేయడం ఆయనకే చెల్లిందని విమర్శించారు. రైతు ప్రాణం కాపాడేందుకు భుజాల మీద కోటయ్యను మోసుకెళ్తున్న పోలీసులు ఎవరు? ప్రధాని మోదీ పంపారా? అని జగన్ ని ప్రశ్నించారు.


Andhra Pradesh
Guntur District
kondaveedu
kotaiah
YSRCP
jagan
Telugudesam
Nara Lokesh
minister
  • Loading...

More Telugu News