Australia: ఆస్ట్రేలియా సిరీస్ కు దూరమైన హార్దిక్ పాండ్యా

  • వెన్నునొప్పితో బాధ పడుతున్న పాండ్యా
  • వన్డేల్లో పాండ్యా స్థానంలో జట్టులోకి వచ్చిన జడేజా
  • 24న విశాఖపట్టణంలో తొలి టీ20

ఆస్ట్రేలియాతో సిరీస్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఐదు మ్యాచ్ ల వన్డే, రెండు మ్యాచ్ ల టీ20 సిరీస్ లకు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా కీలకమైన సిరీస్ నుంచి వైదొలగాడు. వన్డేలకు గాను పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. టీ20లలో ఆడే ఆటగాడి పేరును ప్రకటించాల్సి ఉంది. ఫిబ్రవరి 24న విశాఖపట్టణంలో తొలి టీ20 జరగనుంది. మరోవైపు, ప్రపంచకప్ కు ముందు జరుగుతున్న సిరీస్ కావడంతో... జట్టుకు హార్దిక్ పాండ్యా దూరమవడం కలవరపరిచే అంశమే.

Australia
india
cricket
series
hardhik pandya
out
  • Loading...

More Telugu News