sunil gavaskar: ఇమ్రాన్ ఖాన్ ముందు మంచి అవకాశం ఉంది: గవాస్కర్
- సమస్య పరిష్కారం కోసం ఒక్క స్నేహపూర్వక అడుగు వేయాలి
- మసూద్ అజార్ ను అప్పగించాలి
- నయా పాకిస్థాన్ ను నిర్మించుకోవాలి
నయా పాకిస్థాన్ ను నిర్మిస్తానన్న తన మిత్రుడు, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందు మంచి అవకాశం ఉందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చెప్పారు. ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారమయ్యే దిశగా ఇమ్రాన్ ఒక స్నేహపూర్వక అడుగు వేయాలని... దీనికి ప్రతిస్పందనగా భారత్ మరెన్ని అడుగులు వేస్తుందో చూడాలని తెలిపారు.
పుల్వామా ఉగ్రదాడికి బాధ్యుడైన జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ను ఐక్యరాజ్యసమితికి కానీ, భారత్ కు కానీ ఇమ్రాన్ అప్పగించాలని చెప్పారు. ఏదైనా మాటల్లో ఉండరాదని, చేతల్లో ఉండాలని అన్నారు. టెర్రరిజాన్ని అంతం చేసే దిశగా పని చేయాలని... నయా పాకిస్థాన్ ను నిర్మించుకోవాలని తన మిత్రుడుని కోరుతున్నానని చెప్పారు. లేకపోతే పాకిస్థాన్ ఎప్పటికీ భారత్ వ్యతిరేకిగానే మిగిలిపోతుందని అన్నారు.