Andhra Pradesh: చంద్రబాబు అపారజ్ఞాని.. రామ్ గోపాల్ వర్మకు ఎలాంటి మెసేజ్ ఇవ్వను!: దగ్గుబాటి రానా

  • ట్విట్టర్ లో అభిమానులతో రానా చిట్ చాట్
  • చంద్రబాబుపై ప్రశంసల వర్షం
  • వర్మతో తీసిన సినిమా ఆడలేదని వ్యాఖ్య

యువ కథానాయకుడు రానా తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ టచ్ లో ఉంటాడు. రానా నటించిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రానా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రలో నటించాడు. ఈ నేపథ్యంలో రానా ట్విట్టర్ లో తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.

ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రానా ప్రశంసలు కురిపించారు. ఓ అభిమాని ‘చంద్రబాబు నాయుడిపై మీ అభిప్రాయం ఏంటి?’ అని ప్రశ్నించగా, రానా స్పందిస్తూ..‘చంద్రబాబు చాలా ఫోకస్డ్ గా ఉంటారు. ఆయన చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి. అపారజ్ఞాని అని కితాబిచ్చాడు.

‘గతంలో చంద్రబాబు నాయుడిని కలిశారు కదా.. అప్పుడు ఆయనతో ఏం మాట్లాడారు?’ అని మరో అభిమాని అడిగాడు. దీంతో రానా వెంటనే ‘‘ఏం మాట్లాడానో ‘మహా నాయకుడు’ సినిమాలో చూస్తావ్‌గా’’ అని తెలివిగా జవాబిచ్చి తప్పించుకున్నాడు. తాను రామ్ గోపాల్ వర్మకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకోవడం లేదని రానా స్పష్టం చేశాడు. తాను వర్మతో కలిసి ఓ సినిమా(డిపార్ట్ మెంట్-2012) చేశాననీ, అయితే దాన్ని ఎవ్వరూ చూడలేదని సరదాగా వ్యాఖ్యానించాడు.

Andhra Pradesh
Telangana
Chandrababu
varma
Bollywood
Tollywood
maha nayakudu
rana
Twitter
  • Loading...

More Telugu News