Andhra Pradesh: చింతమనేని వీడియో ఎఫెక్ట్.. వైసీపీ నేత రవిని అరెస్ట్ చేసిన పెదపాడు పోలీసులు!

  • దళితులపై చింతమనేని అనుచిత వ్యాఖ్యలు
  • వీడియోను ఎడిట్ చేశారని టీడీపీ నేత ఫిర్యాదు
  • వైసీపీ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి రవి అరెస్ట్

టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన వీడియోను ఎడిట్ చేసి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చింతమనేని పెదపాడు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. వైసీపీ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి, దళిత నేత కత్తుల రవి జైన్‌ను అరెస్ట్ చేశారు.

కత్తుల రవి జైన్ చింతమనేనికి సంబంధించిన వీడియోను షేర్ చేసినందుకు గానూ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, రవిని వెంటనే విడుదల చేయకపోతే ఆందోళనకు దిగుతామని వైసీపీ శ్రేణులు, ఆయన మద్దతుదారులు హెచ్చరించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని అరెస్ట్ చేయకుండా తమ నేతను అదుపులోకి తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
West Godavari District
ravi
Police
pedapadu
  • Loading...

More Telugu News