times group survey: టైమ్స్ గ్రూప్ మెగా సర్వే.. మళ్లీ మోదీకే ఓటేస్తామన్న 83.89 శాతం ప్రజలు!

  • 2 లక్షల మందిని సర్వే చేసిన టైమ్స్ గ్రూపు
  • ఈ నెల 11 నుంచి 20 వరకూ సర్వే నిర్వహణ
  • రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత ప్రజలు ప్రధాని మోదీకి మరోసారి జై కొట్టారు. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే నరేంద్ర మోదీనే ప్రధానిగా ఎన్నుకుంటామని 83.89 శాతం ప్రజలు తెలిపారు. టైమ్స్ గ్రూప్ నిర్వహించిన మెగా పోల్ లో దాదాపు 2 లక్షల మంది భారతీయులు పాల్గొన్నారు. ఈ నెల 11 నుంచి 20 వరకూ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ 8.33 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.

ఇక పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 1.44 శాతం ఓట్లతో మూడో స్థానంలో, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి 0.43 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఇతరులకు 5.92 శాతం ఓట్లు దక్కాయి. ఇక 2014తో పోల్చుకుంటే రాహుల్ ప్రాచుర్యం పెరిగిందా? అని నిర్వహించిన సర్వేలో పెరగలేదని  63.03 శాతం మంది ప్రజలు తెలపగా, 31.15 శాతం మంది పెరిగిందని అభిప్రాయపడ్డారు.

times group survey
Narendra Modi
BJP
  • Loading...

More Telugu News