keasri: 10,000 మంది అఫ్గాన్లకు ఎదురొడ్డి పోరాడిన 21 జవాన్లు.. 'కేసరి' ట్రైలర్ విడుదల!

  • ప్రధాన పాత్రలో నటించిన అక్షయ్ కుమార్
  • 1897లో సరాగర్హి యుద్ధం నేపథ్యంలో సాగనున్న సినిమా
  • వచ్చే నెల 21న విడుదల చేసేందుకు సన్నాహాలు

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సైనికుడిగా నటిస్తున్న ‘కేసరి’ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల అయింది. ఇందులో 36వ సిక్కు రెజిమెంట్ సైనికుడిగా అక్షయ్ అదరగొట్టాడు. 1897లో సరాగర్హి యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న తిరాహ్ ప్రాంతంలో బ్రిటిష్ ఆర్మీకి చెందిన సరాగర్హి పోస్ట్ ఉంది.

ఈ నేపథ్యంలో అఫ్గాన్ పఠాన్లు, భారత సైనికులకు మధ్య యుద్ధం జరిగింది. కేవలం 21 మంది బ్రిటిష్ ఇండియా సైనికులు ఏకంగా 10,000 మంది పఠాన్ల సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. దాదాపు 600 మంది శత్రువులను హతమార్చాక 21 మంది అమరులవుతారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన కేసరి సినిమా వచ్చే నెల 21న విడుదల కానుంది.

keasri
trailer
Bollywood
akshay kumar
  • Error fetching data: Network response was not ok

More Telugu News