Cellphone Tower: ప్రేయసితో పెళ్లి చేయాలంటూ.. సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేసిన యువకుడు!

  • కొత్తకోట సమీపంలోని మదనాపురంలో ఘటన
  • బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కిన శ్రీధర్
  • పెళ్లి చేయిస్తామని చెప్పి కిందకు దించిన పోలీసులు

తాను ప్రేమించిన యువతితో పెళ్లి చేయించాల్సిందేనని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తూ, ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేస్తుంటే, అతన్ని కిందకు దించడానికి స్థానికులు, పోలీసులు నానా పాట్లూ పడ్డారు. ఈ ఘటన తెలంగాణలోని కొత్తకోట సమీపంలోని మదనాపురంలో జరిగింది.

సదరు గ్రామానికి చెందిన శ్రీధర్ అనే యువకుడు, తాను అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించానని, ఆమెనిచ్చి పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తూ, రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఎక్కాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి పెద్దఎత్తున చేరుకున్నారు. స్నేహితులు, తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పి చూసినా శ్రీధర్ వినలేదు. దీంతో పోలీసులు వచ్చి, ప్రేమించిన అమ్మాయితోనే వివాహం చేయిస్తామని హామీ ఇచ్చి యువకుడిని కిందకు దించి, స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఇటువంటి పని చేయవద్దని హెచ్చరించి ఇంటికి పంపించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News