BJP: ఒక్క పది నిమిషాల సమయం ఇవ్వండి.. దేశ ద్రోహుల సంగతి మేం చూసుకుంటాం: ఎమ్మెల్యే రాజాసింగ్

  • బయటి శత్రువుల కంటే లోపలి శత్రువులు ఎక్కువయ్యారు
  • ఆర్మీకిచ్చిన స్వేచ్ఛలో ఓ పది నిమిషాలు మాకివ్వండి
  • దేశ ద్రోహులను ఏరిపారేస్తాం

పుల్వామా ఉగ్రదాడి విషయంలో హైదరాబాద్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు దేశం బయటే కాదని, దేశంలోనూ శత్రువులు ఉన్నారని అన్నారు. బయటి శత్రువుల సంగతి ఆర్మీ చూసుకుంటే దేశంలోని శత్రువులను తాము చూసుకుంటామని అయితే, అందుకు ఓ పది నిమిషాలు తమకు సమయం ఇవ్వాలని కోరారు. ఆర్మీకి ఇచ్చిన స్వేచ్ఛలో తమకు పది నిమిషాలు చాలని పేర్కొన్నారు. ఆ సమయంలోనే దేశ ద్రోహుల అంతు చూస్తామని అన్నారు. పుల్వామా దాడి విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

BJP
MLA Raja singh
Telangana
Pulwama Attack
  • Loading...

More Telugu News