Chris Gayle: సిక్సర్లలో విండీస్ ఆటగాడు గేల్ సరికొత్త రికార్డు!

  • ఇంగ్లండ్ మ్యాచ్‌లో 12 సిక్సర్లతో సెంచరీ
  • మూడు ఫార్మాట్లలో కలిపి 488 సిక్సర్లు
  • అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డు

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. 12 సిక్సర్లు బాది పట్టపగలే వారికి చుక్కలు చూపించాడు. 129 బంతుల్లో 135 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన గేల్ తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

అన్ని పార్మాట్లలో కలిపి గేల్ మొత్తం 444 మ్యాచ్‌లు ఆడగా 488 సిక్సర్లు నమోదు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. 476 సిక్సర్లతో ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని వెనక్కి నెట్టేశాడు. మ్యాచ్‌ల పరంగా చూసుకుంటే.. గేల్ వన్డేల్లో 287 సిక్సర్లు, టెస్టుల్లో 98, టీ20ల్లో 103 సిక్సర్లు కొట్టాడు.

Chris Gayle
West Indies
England
Sixers
Shahid Afridi
Record
  • Loading...

More Telugu News