Tollywood: నాగబాబు నాకు అన్నయ్య లాంటివాడు: కమెడియన్ పృథ్వీరాజ్

  • మా ఇద్దరి మధ్య చనువు ఉంది
  • వైఎస్ పై ఉన్న అభిమానంతోనే జగన్ ని నాగ్ కలిశారు
  • ప్రభుత్వ వైఫల్యంపై ఓ వీధినాటకం రూపొందిస్తున్నాం

ప్రముఖ సినీ నటుడు నాగబాబు తనకు అన్నయ్య లాంటివాడని కమెడియన్ పృథ్వీరాజ్ అన్నారు. తమ ఇధ్దరి మధ్య ఉన్న చనువుతోనే ‘ఒరేయ్, అరేయ్’ అంటారని అన్నారు. వైసీపీ అధినేత జగన్ ని హీరో నాగార్జున నిన్న కలవడంపై విలేకరులు ప్రశ్నించగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతోనే జగన్ ని ఆయన కలిశారని అన్నారు.

 వచ్చే ఎన్నికల కోసం మరింత మంది కళాకారులు వైసీపీకి మద్దతు ఇవ్వనున్నట్టు ఈ సందర్భంగా పృథ్వీరాజ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఏపీలో ప్రభుత్వ వైఫల్యంపైన, అలాగే వైసీపీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చిన ‘నవరత్నాలు’పైనా కళాకారులతో ఓ వీధినాటకానికి రూపకల్పన చేస్తున్నట్టు వైసీపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి గా ఇటీవలే నియమితులైన పృథ్వీ చెప్పారు.

Tollywood
naga babu
Prudhvi Raj
Nagarjuna
  • Loading...

More Telugu News