Telangana: తలసానిని మర్యాదపూర్వకంగా కలిశా.. మంత్రి అయినందుకు అభినందించా: తోట త్రిమూర్తులు

  • వ్యక్తిగత పనుల నిమిత్తం హైదారాబాద్ వచ్చా
  • మా భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు
  • పాతికేళ్లుగా నేను, తలసాని మంచి మిత్రులం

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఏపీ టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఈరోజు కలిసిన విషయం తెలిసిందే. తలసానిని తోట త్రిమూర్తులు ఎందుకు కలిశారా అన్న ఆసక్తి రాజకీయంగా నెలకొంది. ఈ నేపథ్యంలో తోట త్రిమూర్తులు ఈ విషయమై స్పష్టత నిచ్చారు. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదారాబాద్ వచ్చానని, కొత్తగా మంత్రి అయిన తలసానిని మర్యాదపూర్వకంగా కలిసి, అభినందించానని చెప్పారు. అంతేతప్ప, తమ భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు. పాతికేళ్లుగా తాను, తలసాని మంచి మిత్రులమని, నాడు టీడీపీలో కలిసి పనిచేశామని గుర్తుచేసుకున్నారు.

Telangana
talasani
Andhra Pradesh
Telugudesam
thota
trimuruthulu
  • Loading...

More Telugu News