Telangana: కేసీఆర్ నన్ను బెదిరించడం వల్లే వైసీపీలో చేరానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే!: వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ ఛాలెంజ్

  • హైదరాబాద్ లో నా కొక్కడికే ఆస్తులున్నాయా?
  • టీడీపీ నేతలకు లేవా?
  • ఎనభై శాతం నాయకులకు హైదరాబాద్ లో ఆస్తులున్నాయి  

హైదరాబాద్ లో ఆస్తులున్న టీడీపీ నాయకులను కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు బెదిరించి వైసీపీలో చేర్పిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై  ఇటీవలే వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ స్పందించారు. 'హైదరాబాద్ లో నాకొక్కడికే ఆస్తులున్నాయా? టీడీపీ నేతలకు లేవా?' అని ప్రశ్నించారు. ఎనభై శాతం నాయకులకు హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయని అన్నారు.

కేసీఆర్, కేటీఆర్ తనతో మాట్లాడారని, బెదిరించారని చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. ఐదేళ్లలో టీఆర్ఎస్ నేతలు ఎవరినైనా బ్లాక్ మెయిల్ చేశారా? అని ప్రశ్నించారు. నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తనను బెదిరించారన్న వార్తలు అబద్ధమని అవంతి కొట్టిపారేశారు.

Telangana
cm
kcr
YSRCP
avanthi srinivas
  • Loading...

More Telugu News