vote ki note: ఈడీ అధికారులు వేధిస్తున్నారు.. చంద్రబాబును ఈ కేసులోకి లాగాలని చూస్తున్నారు: రేవంత్ రెడ్డి

  • రెండో రోజు ముగిసిన ఈడీ విచారణ
  • నిన్నటి నుంచి అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారు
  • చంద్రబాబు టార్గెట్ గా ఈడీ ప్రశ్నలు ఉన్నాయి

‘ఓటుకు నోటు’ కేసులో వరుసగా రెండో రోజన రేవంత్ రెడ్డి విచారణ ముగిసింది. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈడీ అధికారులు విచారణ పేరిట నిన్నటి నుంచి అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారని, తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబును ఈ కేసులోకి లాగాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఈ కేసు విషయంలో చంద్రబాబుకు గతంలోనే క్లీన్ చిట్ ఇచ్చినా, మళ్లీ ఆయన పేరును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్, మోదీ ఒత్తిడితో ఈడీ అధికారులు పనిచేస్తున్నారని, ఈ కేసులో రాజకీయ కుట్ర కనిపిస్తోందని, చంద్రబాబు టార్గెట్ గా ఈడీ ప్రశ్నలు ఉన్నాయని అన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే, హైకోర్టు కొట్టేసిన కేసును తిరగదోడుతున్నారని టీ-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు.

vote ki note
t-congress
Revanth Reddy
Telugudesam
Chandrababu
Andhra Pradesh
cm
ED
  • Loading...

More Telugu News