Jana Sena: ‘జనసేన’ ఆశావహుల బయోడేటాల స్వీకరణకు తుదిగడువు ఈ నెల 25
- బయోడేటాలను సమర్పిస్తున్న ఆశావహులు
- స్క్రీనింగ్ కమిటీకి ఈరోజు 170 బయోడేటాల సమర్పణ
- ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి అధికంగా ఆశావహులు
రాబోయే ఎన్నికల్లో ’జనసేన’ తరపున పోటీ చేయాలనుకునే ఆశావహుల బయోడేటాల స్వీకరణకు తుదిగడువు ఈ నెల 25 వ తేదీగా నిర్ణయించినట్టు ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేయాలనుకున్న ఆశావహుల బయోడేటాల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది.
విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీకి తమ బయోడేటాలను ఆశావహులు సమర్పించారు. ఈరోజు స్క్రీనింగ్ కమిటీకి మొత్తం 170 బయోడేటాలు అందినట్టు ఆ ప్రకటనలో తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి చెందిన జిల్లాల నుంచి ఆశావహులు ఎక్కువ మంది వచ్చినట్టు జనసేన పేర్కొంది.