Himachal Pradesh: మంచు చరియలు విరిగిపడటంతో ఆరుగురు జవానుల మృతి!

  • నంగ్య రీజియన్‌లో విరిగిపడిన మంచు చరియలు
  • విధుల్లో ఐటీబీపీ, స్థానిక పోలీసులు
  • ఒకరి మృతదేహాన్ని వెలికితీసిన అధికారులు

హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలోని నంగ్య రీజియన్ ప్రాంతంలో నేడు మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐటీబీపీకి చెందిన ఆరుగురు జవానులు మృతి చెందగా, మరో ఐదుగురు జవానులు మంచు చరియల కింద కూరుకుపోయారు. ఘటనా సమయంలో ఐటీబీపీతోపాటు స్థానిక జిల్లా పోలీసులు భద్రతా విధుల్లో ఉన్నారు. ఇప్పటికి ఒక జవాను మృతదేహాన్ని వెలికి తీయగా, మిగతా వారిని వెలికితీసేందుకు చర్యలు చేపట్టినట్టు కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ గోపాల్ చంద్ తెలిపారు.

Himachal Pradesh
Soldiers
ITBP
Local Police
Gopal Chand
  • Loading...

More Telugu News