Yanamala Ramakrishnudu: ప్రజల ఆలోచనలకు అనుకూలంగా మేనిఫెస్టోను తయారు చేస్తాం: అచ్చెన్నాయుడు
- జీఎస్‌డీపీని 24 లక్షల కోట్లకు చేర్చాలి
- 25న మరోమారు సమావేశం
- అన్ని జిల్లాల పార్టీ నేతలతో చర్చిస్తాం
మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలోని టీడీపీ మేనిఫెస్టో కమిటీ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశానికి మంత్రులు అచ్చెన్నాయుడు, ఫరూక్, ఆనందబాబు, శ్రావణ్ తదితర సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 2019 ఎన్నికల మ్యానిఫెస్టోపై ప్రాథమికంగా చర్చించినట్టు తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను నూరు శాతం అమలు చేశామని తెలిపారు. ప్రస్తుత మేనిఫెస్టోలో సంక్షేమం, యువత, మహిళ, మధ్యతరగతి వర్గాలపై దృష్టి సారించినట్టు తెలిపారు.
కుటుంబ వికాసం కోసం మేనిఫెస్టోలో 15 అంశాలు, సమాజ వికాసం కోసం 10 అంశాలను చేరుస్తామని తెలిపారు. మేనిఫెస్టోకు సంబంధించి 25న మరోమారు సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల పార్టీ నేతలో చర్చిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఇతర పార్టీల మాదిరిగా కాకుండా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మేనిఫెస్టో తయారు చేస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.