Chandrababu: చంద్రబాబు వ్యాఖ్యలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: కన్నా లక్ష్మీనారాయణ

  • ఉగ్రదాడి మోదీ పనేనంటూ చంద్రబాబు ఆరోపణ
  • దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్
  • చంద్రబాబు వ్యాఖ్యలు గర్హనీయం

సీఎం చంద్రబాబుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. నేడు ఆయన తూర్పు గోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. కశ్మీర్ ఉగ్ర దాడి ప్రధాని నరేంద్ర మోదీ పనేనని చంద్రబాబు ఆరోపించడంపై కన్నా ధ్వజమెత్తారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు గర్హనీయమన్నారు.

Chandrababu
Kanna Lakshminarayana
BJP
Kashmir
Narendra Modi
Andhra Pradesh
  • Loading...

More Telugu News