imran khan: ఇమ్రాన్ ఖాన్ కు ఓ అవకాశం ఇద్దాం.. వాళ్ళేం చేస్తారో చూద్దాం!: మెహబూబా ముఫ్తీ
- ప్రధానిగా ఇమ్రాన్ ఇప్పుడే బాధ్యతలను చేపట్టారు
- కొత్తగా చర్చలు ప్రారంభిద్దామని చెబుతున్నారు
- పుల్వామా ఆధారాలు పాకిస్థాన్ కు ఇవ్వాలి
పుల్వామా ఉగ్రదాడి విషయంలో పాకిస్థాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఓపక్క మన దేశంలో విమర్శలు వెల్లువెత్తుతుంటే.. మరోపక్క జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడే బాధ్యతలు చేపట్టారని, ఇరు దేశాల మధ్య కొత్తగా చర్చలు ప్రారంభిద్దామని చెబుతున్నారని, అందువల్ల ఆయనకు ఒక అవకాశం ఇచ్చి చూడాలని వ్యాఖ్యానించారు. పఠాన్ కోట్, ముంబై దాడుల విషయంలో పాకిస్థాన్ కు ఆధారాలను అందజేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వాస్తవమే అయినప్పటికీ, ఇప్పుడు ఇమ్రాన్ అడిగినట్టుగా పుల్వామా దాడిపై పాకిస్థాన్ కు ఆధారాలను అందజేయాలని, ఆ తర్వాత వారు ఏం చేస్తారో చూడాలని అన్నారు.