shiva Rao: ఏపీ పర్యాటక శాఖ అకౌంట్స్ ఆఫీసర్ నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు

  • తనిఖీలలో పాల్గొన్న 25 మంది అధికారులు 
  • గతంలో రూరల్ ఎమ్మార్వోగా శివరావు
  • ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ లో మరో అధికారిపై ఏసీబీ వలపన్నింది. పర్యాటక శాఖ అకౌంట్స్ ఆఫీసర్ శివరావు నివాసంపై ఏసీబీ అధికారులు ఈ రోజు సోదాలు నిర్వహించారు. నేడు విజయవాడ లబ్బీపేటలోని శివరావు నివాసానికి చేరుకున్న 25 మంది ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో పలు కీలకమైన డాక్యుమెంట్లు, చెక్కులను ఏసీబీ అధికారులు పరిశీలించారు. గతంలో విజయవాడలో రూరల్ ఎమ్మార్వోగా పనిచేసిన శివరావు ప్రస్తుతం పర్యాటక శాఖలో అకౌంట్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై దాడులు నిర్వహించారు.

shiva Rao
Vijayawada
ACB Raids
Accounts Officer
Rural MRO
  • Loading...

More Telugu News