Guntur District: రైతు కోటయ్య మృతికి చంద్రబాబు, పుల్లారావే బాధ్యులు: వైసీపీ నేత పార్థసారధి

  • ఈ ఘటనకు పోలీసులు కూడా బాధ్యత వహించాలి
  • రైతుల పట్ల టీడీపీ అహంకార ధోరణిని కనబరుస్తోంది
  • ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విచారణ చేయించాలి

గుంటూరు జిల్లా కొండవీడులో బీసీ రైతు కోటయ్య మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావే బాధ్యులని వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారధి ఆరోపించారు. కొండవీడులో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనకు పోలీసులు కూడా బాధ్యత వహించాలని అన్నారు. రైతుల పట్ల టీడీపీ అహంకార ధోరణిని కనబరుస్తోందని, కోటయ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్నారు. కోటయ్య మృతిపై పోలీసులు అసత్యాలు చెబుతున్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

Guntur District
kondaveedu
cm
Chandrababu
farmer
kotaiah
YSRCP
prathi pati
  • Loading...

More Telugu News