Prabhas: 'ఐ లవ్యూ' చెప్పాలంటే అది ప్రభాస్ కే చెబుతా!: వరలక్ష్మి

  • బోల్డ్ గా మాట్లాడి విమర్శలు కొని తెచ్చుకునే వరలక్ష్మి
  • ప్రభాస్ అంటే ఎంతో ఇష్టం
  • ఓ ఇంటర్వ్యూలో చెప్పిన తమిళ హీరోయిన్

డేరింగ్ అండ్ డైనమిక్ గా ఉంటూ, బోల్డ్ గా మాట్లాడుతూ వివాదాలు కొని తెచ్చుకుంటూ, సంచలన వ్యాఖ్యలు చేస్తుండే తమిళ నటి వరలక్ష్మి, తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం ఈసారి ఆమె ప్రభాస్ పేరు ఎత్తడమే. తాను ఎవరికైనా ఐ లవ్యూ అని చెప్పాలని భావిస్తే, అది బాహుబలి ప్రభాస్ కు మాత్రమే చెబుతానని వ్యాఖ్యానించింది.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ అంటే తనకెంతో ఇష్టమని కూడా చెప్పింది. కేవలం హీరోయిన్ క్యారెక్టర్లు మాత్రమే కాకుండా, గ్లామర్ రోల్స్ కోసం చూడకుండా, తనకు నచ్చిన పాత్రను చేస్తూ, దూసుకెళుతున్న వరలక్ష్మి, ప్రస్తుతం కోలీవుడ్ లో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరిగా ఉంది. కొంతకాలం క్రితం వరకూ హీరో విశాల్ తో చెట్టపట్టాలేసుకుని తిరిగిన ఆమె, విశాల్ ను పెళ్లాడనుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే, హైదరాబాద్ కు చెందిన అనీషా అనే యువతితో విశాల్ వివాహం ఫిక్స్ కావడంతో ఈ ఊహాగానాలకు తెరపడింది.

Prabhas
Varalakshmi Sharatkumar
Interview
  • Loading...

More Telugu News