Jagan: లండన్ బయలుదేరిన జగన్ దంపతులు.. ఆరు రోజులు కుమార్తెతోనే!

  • జగన్ లండన్ వెళ్లేందుకు కోర్టు అనుమతి
  • లండన్‌లో చదువుకుంటున్న జగన్ కుమార్తె
  • తిరిగి ఈ నెల 26న బయలుదేరనున్న జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి-భారతి దంపతులు మంగళవారం రాత్రి లండన్ బయలుదేరారు. అక్కడి స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదువుతున్న కుమార్తెను చూసేందుకు వెళ్లిన జగన్ దంపతులు అక్కడే ఆరు రోజులు గడపనున్నారు. తిరిగి ఈ నెల 26న లండన్ నుంచి తిరుగు పయనం కానున్నారు.

నిజానికి జగన్ గత నెలలోనే లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే, ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడంతో ఆయన పర్యటన వాయిదా పడింది. లండన్‌ స్కూల్‌లో చదువుతున్న తన కుమార్తెను కలిసేందుకు బ్రిటన్ వెళ్లాలనుకుంటున్నానని, తనను అనుమతించాల్సిందిగా కోరుతూ జగన్ పెట్టుకున్న పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. లండన్‌లో పర్యటించే ప్రదేశాలు, ల్యాండ్‌ ఫోన్‌, సెల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌, ఫ్యాక్స్‌ నంబర్‌ తదితర వివరాలను కోర్టుతోపాటు సీబీఐ అధికారులకు సమర్పించాలని షరతు పెట్టింది.

Jagan
YSRCP
CBI Court
London
Daughter
Bharathi
  • Loading...

More Telugu News