vote ki note: ముగిసిన ఈడీ అధికారుల విచారణ.. రేపు మళ్లీ విచారణకు రేవంత్ రెడ్డి

  • సుమారు 8 గంటల పాటు రేవంత్ విచారణ
  • అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పాను
  • రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కుమ్మక్కై నాపై దాడులు  

'ఓటుకు నోటు' కేసులో రేవంత్ రెడ్డి విచారణ ముగిసింది. సుమారు 8 గంటల పాటు ఈడీ అధికారులు ఆయన్ని విచారించారు. విచారణ అనంతరం, మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రేపు మరోసారి అధికారులు తనను విచారించనున్నట్టు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కుమ్మక్కై తనపై ఐటీ దాడులు చేయించిందని, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈడీ అధికారులను తనపై ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

vote ki note
Revanth Reddy
Ed
Hyderabad
  • Loading...

More Telugu News