Guntur District: నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవద్దు!: రైతు కోటయ్య మృతిపై పవన్ కల్యాణ్ స్పందన..

  • కోటయ్య మృతిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి
  • సమీక్ష నిమిత్తం మా పార్టీ ప్రతినిధులు వెళ్తున్నారు
  • సానుభూతితో వ్యవహరించి బాధ్యత తీసుకోవాలి

గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్య మృతి ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రైతు కోటయ్య మృతిపై భిన్న కథనాలు వినిపిస్తున్న తరుణంలో సమీక్ష నిమిత్తం తమ పార్టీ ప్రతినిధులు అక్కడికి వెళ్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి తాను చెప్పేది ఒక్కటేనని, ఏదో నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవద్దని, సానుభూతితో వ్యవహరించి బాధ్యత తీసుకోవాలని సూచించారు. అన్నదాత స్వేదంతోనే బతుకుతున్న సమాజానికి రైతుల ఆర్తనాదాలు మంచివి కావని పవన్ తన ట్వీట్ లో తెలిపారు.


Guntur District
kondaveedu
cm
Chandrababu
Jana Sena
Pawan Kalyan
farmer
kottaiah
  • Loading...

More Telugu News