karem Sivaji: ఎప్పుడూ మత్తులో ఉండే నువ్వు మా పార్టీ గురించి మాట్లాడతావా?: వైసీపీలో చేరిన రవీంద్రబాబుపై కారెం శివాజీ ధ్వజం

  • మొహం అద్దంలో చూసుకో
  • జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు
  • రవీంద్రబాబు ఎవరికీ తెలియదు
  • ఆయనను ఎంపీని చేసిందే టీడీపీ

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు గతంలో అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు తన కొడుకు పెళ్లి కార్డు ఇవ్వటానికి వెళితే.. బయటకు నెట్టారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ వ్యాఖ్యానించారు. అటువంటి వ్యక్తి నేడు వైసీపీ అధినేత జగన్ పంచన చేరి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ విరుచుకు పడ్డారు. రవీంద్రబాబు టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. అనంతరం సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీనిపై నేడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ.. కోనసీమలో అసలు రవీంద్రబాబు ఎవరికీ తెలియడని, అటువంటి వ్యక్తి కోనసీమకు నిధులు తీసుకొచ్చానని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. అసలు ఆయనను గుర్తించి, ఎంపీని చేసిందే టీడీపీ అని శివాజీ పేర్కొన్నారు. ఢిల్లీలో ఏనాడైనా ఆంధ్రప్రదేశ్ సమస్యలపై మాట్లాడావా? అంటూ నిలదీశారు. ఎప్పుడూ మత్తులో ఉండే నీవు మా పార్టీపై మాట్లాడతావా? అంటూ మండిపడ్డారు. నీ మొహం అద్దంలో చూసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. జగన్ ఎప్పటికీ సీఎం కాలేడని.. అసెంబ్లీకి రాలేడని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే ప్రజల్లో తిరగలేవని రవీంద్రబాబును హెచ్చరించారు.  

karem Sivaji
Ravindra babu
Jagan
Chandrababu
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News