Vibhuthi Shankar Doundiyal: వీరమరణం పొందిన మేజర్‌కు వీడ్కోలు ముద్దు పెట్టి ఐలవ్యూ చెప్పిన భార్య.. చలించిపోయిన స్థానికులు!

  • గతేడాది డౌండియాల్, నికితల వివాహం
  • పెళ్లి రోజుకు వస్తానని చెప్పిన భర్త
  • భర్త త్యాగానికి గర్విస్తున్నానని వెల్లడి

పుల్వామాలో నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో మేజర్ విభూతి శంకర్ డౌండియాల్‌తో పాటు మరో ముగ్గురు జవానులు ప్రాణాలు కోల్పోయారు. డౌండియాల్ భౌతికకాయాన్ని నేడు స్వస్థలమైన డెహ్రాడూన్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డౌండియాల్ భార్య నికిత.. భర్తకు చివరి సారిగా ముద్దుపెట్టి.. ఐలవ్యూ అని చెప్పి, ఘన నివాళి అర్పించారు. మేజర్ డౌండియాల్, నికితల వివాహం గతేడాది జరిగింది.

తొలి వివాహ వార్షికోత్సవం నాటికి సెలవు తీసుకుని ఇంటికి వస్తానని భార్యతో డౌండియాల్ చెప్పారు. కానీ నేడు ఆయన పార్థీవ దేహం భార్య కళ్ల ముందుకు వెళ్లింది. దీంతో నికిత.. డౌండియాల్ భౌతిక కాయం పక్కనే కూర్చొని తుదిసారి ముద్దు పెట్టుకుని.. ఐలవ్యూ అంటూ కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసిన అక్కడి వారు చలించిపోయారు. దేశం కోసం తన భర్త చేసిన త్యాగానికి గర్విస్తున్నానని నికిత తెలిపారు.

Vibhuthi Shankar Doundiyal
Pulwama
Dehradun
Nikitha
  • Loading...

More Telugu News