1936లో కనిపించిన అరుదైన పాము.. మళ్లీ ఇన్నేళ్లకు కంటపడింది!
- పెట్రోలింగ్‌కు వెళ్లిన అటవీ అధికారుల బృందం
- రైలు పట్టాలపై రెడ్ కోరల్ కుక్రి గుర్తింపు
- ఫోటో తీసిన బృందంలోని సభ్యుడు
ఈ సందర్భంగా డీటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ రమేష్ కుమార్ పాండే మాట్లాడుతూ.. ‘‘దాదాపు 82 సంవత్సరాల తర్వాత దుద్వా అటవీ ప్రాంతంలో ఈ అరుదైన సర్పాన్ని గుర్తించాం. సోమవారం రాత్రి అటవీ అధికారుల బృందం దక్షిణ సోనారిపూర్ రేంజ్ అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్‌కు వెళ్లింది. సమీప రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపై ఒక మీటరు పొడవున్న రెడ్ కోరల్ కుక్రిని గుర్తించారు. నారింజ రంగులో మెరిసి పోతూ కనిపించిన ఈ సర్పాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు. వెంటనే బృందంలోని ఒకరు దాన్ని ఫొటో తీశారు’ అని తెలిపారు.