Tollywood: మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. నాపై నాగార్జున పోటీ చేస్తారంటే నమ్మను: గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్

  • జగన్ ని నాగార్జున కలవడంపై గల్లా స్పందన
  • నాగార్జున ఏదైనా చేసే ముందు నాతో మాట్లాడతారు
  • అందుకని, ఈ వ్యాఖ్యలు నమ్మను

వైసీపీ అధినేత జగన్ ని ప్రముఖ సినీ నటుడు నాగార్జున ఈరోజు కలిసిన విషయం తెలిసిందే. జగన్ తో నాగార్జున భేటీ కావడంపై రాజకీయంగా చర్చలకు దారితీస్తోంది. వైసీపీ తరపున గుంటూరు నుంచి నాగార్జున పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు.

అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై ప్రశ్నించిన విలేకరులకు ఆయన సమాధానమిస్తూ, ‘నాకు తెలియదు. నేను వైసీపీలో లేను. హైదరాబాద్ లో లేను. కాబట్టి దాని గురించి కామెంట్ చేయలేను’ అని అన్నారు.‘అక్కినేని నాగార్జున గుంటూరు నుంచి మీపై పోటీ చేస్తే..’ అనే ప్రశ్నకు గల్లా జయదేవ్ స్పందిస్తూ, ‘ఆయన వస్తాడని నేను అనుకోవట్లేదు. నేను, నాగార్జున మంచి ఫ్రెండ్స్. ఆయన ఏదైనా చేసేట్టయితే, నాతో మాట్లాడి చేస్తారు కాబట్టి, నేను నమ్మను’ అన్నారు.

Tollywood
Nagarjuna
Guntur District
mp
jagan
galla
jayadev
lotu fond
YSRCP
  • Loading...

More Telugu News