jagammapet: జగ్గంపేట ఎమ్మెల్యే సీటును మా కుటుంబసభ్యులకు ఇవ్వమని కోరాను: చంద్రబాబును కలిసిన తోట నర్సింహం

  • ఆలోచించి నిర్ణయం చెబుతానని చంద్రబాబు చెప్పారు
  • గతంలో జగ్గంపేట నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా
  • టీడీపీ ఎంపీలు పార్టీలు మారడం వారి వ్యక్తిగతం

జగ్గంపేట సీటును తన కుటుంబసభ్యులకు ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరానని కాకినాడ టీడీపీ ఎంపీ తోట నర్సింహం అన్నారు. తోట నర్సింహం తన కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబును ఈరోజు మధ్యాహ్నం కలుసుకున్నారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ విషయమై ఆలోచించి నిర్ణయం చెబుతానని చంద్రబాబు చెప్పారని అన్నారు. గతంలో జగ్గంపేట నుంచి తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. టీడీపీ ఎంపీలు పార్టీలు మారడం వారి వ్యక్తిగత విషయమని అన్నారు. పార్టీలు మారేటప్పుడు నేతలు విమర్శలు చేయడం సహజమని అభిప్రాయపడ్డారు. తాను టీడీపీలోనే ఉంటానని తోట నర్సింహం స్పష్టం చేశారు.

jagammapet
kakinada
Telugudesam
mp
thota narasimham
Chandrababu
amaravathi
  • Loading...

More Telugu News