Bengalore: బెంగళూరులో ఆకాశంలో ఢీకొన్న రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు!

  • బెంగళూరులో ఏరో ఇండియా ప్రదర్శన
  • రిహార్సల్స్ జరుగుతుండగా అపశ్రుతి
  • ప్రాణాలతో బయటపడ్డ పైలట్లు

బెంగళూరులో జరుగుతున్న విమానయాన ప్రదర్శనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ ఉదయం రిహార్సల్స్ కోసం భారత వాయుసేన విమానాలు విన్యాసాలు చేస్తున్న వేళ, గాల్లో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఆపై రెండూ మంటల్లో చిక్కుకోగా, పైలట్లు సీట్ ఎజెక్ట్ వ్యవస్థ ద్వారా సురక్షితంగా బయటపడ్డారు.

ఇవి రెండూ హక్ ట్రయినర్ జెట్ విమానాలని, సూర్యకిరణ్ ఏరోబెటిక్ టీమ్ లో భాగంగా ప్రదర్శనలో పాల్గొంటున్నాయని, గాల్లో ఢీకొన్న విమానాలు నిర్మానుష్య ప్రాంతంలో కూలడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన తరువాత ఎయిర్ షో రిహార్సల్స్ ను అధికారులు నిలిపివేశారు. అధికారికంగా రేపటి నుంచి ఐదు రోజుల పాటు ప్రదర్శన జరుగనుండగా, నేడు రిహార్సల్స్ జరుగుతున్నాయి.

Bengalore
Aero India
Air Show
  • Loading...

More Telugu News