India: పాకిస్థానీలకు 48 గంటల గడువు ఇస్తున్నాం.. నగరాన్ని విడిచి వెళ్లిపోండి!: బికనీర్ కలెక్టర్ ఆదేశాలు

  • పుల్వామా ఘటన నేపథ్యంలో ఆదేశం
  • రెండు నెలల పాటు ఉత్తర్వుల అమలు
  • ఆశ్రయమివ్వరాదని హోటల్స్, లాడ్జీలకు సూచన

జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ ల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ కు అత్యంత అనుకూల దేశం(ఎంఎఫ్ఎస్) హోదాను ఉపసంహరించుకున్న భారత్.. పాక్ ఉత్పత్తులపై సుంకాలను 200 శాతం పెంచింది. తాజాగా రాజస్థాన్ లోని బికనీర్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీచేశారు. బికనీర్ లో పనిచేస్తున్న పాకిస్థానీలు 48 గంటల్లోగా నగరాన్ని విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశించారు.

ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. జిల్లాలోని హోటళ్లు, లాడ్జిల్లో పాకిస్థానీలను అనుమతించరాదని సూచించారు. ఈ ఆదేశాలు రెండు నెలల పాటు అమల్లో ఉంటాయని తెలిపారు.

మరోపక్క, పాక్‌ కళాకారులు భారతీయ చిత్ర పరిశ్రమలో పనిచేయడాన్ని నిషేధిస్తున్నట్లు ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ ఇప్పటికే ప్రకటించింది. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ చేసిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News