Lovers Day: ప్రేక్షకులకు నచ్చలేదట... 'లవర్స్ డే'కు కొత్త క్లైమాక్స్!

  • గత వారంలో విడుదలైన లవర్స్ డే
  • కలెక్షన్లను రాబట్టడంలో విఫలం
  • మార్చిన క్లైమాక్స్ రేపటి నుంచి

గత వారంలో విడుదలై, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న 'లవర్స్ డే' క్లైమాక్స్ ను నిర్మాతలు మార్చారు. మలయాళంలో నిర్మితమై, నటిగా ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కు సినిమా విడుదలకు ముందే పాప్యులారిటీని తెచ్చి పెట్టిన 'ఒరు అడార్‌ లవ్‌' డబ్బింగ్ వర్షన్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న చిత్రం విడుదల కాగా, కలెక్షన్లను మాత్రం పొందలేకపోయింది. చిత్రంలోని క్లైమాక్స్‌ ప్రేక్షకులను నిరాశకు గురిచేసిందని కామెంట్లు రావడంతో, 10 నిమిషాల కొత్త క్లైమాక్స్ ను చిత్రీకరించామని, బుధవారం నుంచి ప్రేక్షకులు కొత్త క్లైమాక్స్ ను చూడవచ్చని దర్శకుడు ఒమర్ తెలిపారు. రియలిస్టిక్ గా సినిమాను చూపించాలన్న ఉద్దేశంతోనే క్లైమాక్స్ లో ట్రాజడీని చూపించామని, అయితే, ప్రేక్షకులు నిరాశ చెందడంతో, నిర్మాతలతో చర్చించి ముగింపును మార్చామని అన్నారు.

Lovers Day
Priyaprakash varier
Clymax
  • Loading...

More Telugu News