Andhra Pradesh: జోరు పెంచిన పవన్ కల్యాణ్.. ఈ నెల 21 నుంచి రాయలసీమ టూర్!

  • తొలుత కర్నూలులో మూడ్రోజులు భేటీ
  • అనంతరం కడప, చిత్తూరులో సమావేశాలు
  • రైతులు, కార్మికులతో జనసేనాని ముఖాముఖి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాయలసీమపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ నెల 21, 22, 23 తేదీల్లో పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. అక్కడ పార్టీ ఎన్నికల సన్నద్ధత, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.

అనంతరం ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో కడప జిల్లాలో పవన్ జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ నెల 28, వచ్చే నెల 1, 2 తేదీల్లో చిత్తూరు జిల్లాలో జనసేనాని పర్యటించనున్నారు. రాయలసీమలో యురేనియం, ఉక్కు పరిశ్రమలను పరిశీలించడంతో పాటు కేసీ కాలువ ఆయకట్టు రైతులతో ఈ సందర్భంగా పవన్ ముఖాముఖి సమావేశమవుతారు. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను జనసేన పార్టీ త్వరలోనే విడుదల చేయనుంది.

Andhra Pradesh
Jana Sena
Pawan Kalyan
rayalaseema tour
  • Loading...

More Telugu News