Vizag: పెళ్లికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లి... హత్యకు గురైన భవాని... రంగంలోకి దిగిన పోలీసులు!

  • విశాఖపట్నం జిల్లా సబ్బవరంలో ఘటన
  • విజయనగరంలోని పెళ్లికి బయలుదేరిన భవానీ
  • కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు

అమరావతి ప్రాంతంలో జరిగిన జ్యోతి హత్య కేసు ఓ కొలిక్కి రాకముందే, విశాఖపట్నం జిల్లా సబ్బవరం సమీపంలోని సరుగుడు తోటలో భవానీ అనే యువతి దారుణ హత్యకు గురైంది. ఆదివారం నాడు ఓ పెళ్లికి హాజరయ్యే నిమిత్తం ఇంట్లో నుంచి బయలుదేరిన ఆమె, తిరిగి ఇల్లు చేరలేదు. ఆమె కోసం బంధువులు విచారిస్తుండగానే, తోటలో యువతి మృతదేహం ఉందన్న సమాచారం పోలీసులకు తెలిసింది. ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు ఆమె తుంగ్లాం ప్రాంతానికి చెందిన భవానిగా గుర్తించి, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు.

తమ బిడ్డ విజయనగరంలో పెళ్లికి వెళ్లి వస్తానని చెప్పి, ఒంటిపై 5 తులాల బంగారు ఆభరణాలు ధరించి వెళ్లిందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహంపై నగలు మాయం కావడంతో వాటి కోసమే దుండగులు భవానీని టార్గెట్ చేసి హత్య చేశారా? అన్న కోణంలో పోలీసుల దర్యాఫ్తు సాగుతోంది.  

Vizag
Sabbavaram
Bhavani
Murder
Marriage
  • Loading...

More Telugu News