Petrol: వరుసగా ఆరో రోజూ స్వల్పంగా పెరిగిన 'పెట్రో' ధరలు!
- అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు
- లీటరు పెట్రోలుపై 10 పైసలు పెరుగుదల
- 9 పైసలు పెరిగిన డీజిల్ ధర
ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆ ప్రభావం భారత్ పైనా పడింది. వరుసగా ఆరో రోజూ పెట్రోలు ధరలు పెరిగాయి. మంగళవారం నాడు లీటరు పెట్రోలుపై 10 పైసలు, డీజిల్ పై 9 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. దీంతో ముంబైలో అత్యధికంగా పెట్రోలు ధర రూ. 76.64కు చేరగా, ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 71ని దాటింది.
మెట్రో నగరాల్లో ధరలను పరిశీలిస్తే, ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 76.64కు, డీజిల్ ధర రూ. 69.30కు చేరగా, కోల్ కతాలో పెట్రోలు ధర రూ. 73.11కు డీజిల్ రూ. 67.95కు పెరిగింది. చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 73.72కు, డీజిల్ ధర రూ. 69.91కు చేరింది. హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 75.34కు, డీజిల్ ధర రూ. 71.95కు చేరుకోగా, విజయవాడలో పెట్రోలు ధర రూ. 75.12, డీజిల్ ధర రూ.71.33గా ఉంది.