GMC Balayogi: అమలాపురం ఎంపీ గుడ్ బై చెప్పగానే... హరీశ్ ను రంగంలోకి దించిన టీడీపీ!

  • జీఎంసీ బాలయోగి కుమారుడికి ప్రమోషన్
  • రవీంద్రబాబుకు టికెట్ ఇవ్వలేమని చెప్పిన టీడీపీ
  • రవీంద్రకు గన్నవరం అసెంబ్లీ సీటు ఖరారు చేసిన జగన్!

రానున్న ఎన్నికల్లో తమకు టికెట్ రాదని భావిస్తున్న నేతలు ఫిరాయింపులకు తెరదీసిన నేపథ్యంలో, అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర బాబు, తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరగానే, మాజీ ఎంపీ, దివంగత జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్ ను టీడీపీ రంగంలోకి దించింది. వాస్తవానికి అమలాపురం టికెట్ ను హరీశ్ కు ఆఫర్ చేయడంతోనే రవీంద్రబాబు పార్టీ మారారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. హరీశ్ ను టీడీపీ అధిష్ఠానం ప్రమోట్ చేస్తూ, ఎంపీగా ఉన్న తనను పక్కన పెట్టడంపై రవీంద్ర మనస్తాపంతో ఉన్నట్టు ముందే వార్తలు వచ్చాయి. ఇక రవీంద్రకు గన్నవరం అసెంబ్లీ సీటును జగన్ ఖరారు చేసినట్టు సమాచారం.

ఇదిలావుండగా, వచ్చే ఎన్నికల్లో తాను గెలిస్తే, మంత్రి పదవి కచ్చితంగా కావాలని పట్టుబడుతున్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే వైసీపీలో చేరితే, అదే నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నేత టీడీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని, ఈ మేరకు టీడీపీ నేతలతో చర్చించారని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

GMC Balayogi
Hareesh
Telugudesam
Ravindrababu
Amalapuram
  • Loading...

More Telugu News