Chandrababu: చంద్రబాబును కలిసిన వైసీపీ నేత యడం బాలాజీ.. టీడీపీలో చేరికకు సిద్ధం
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-9ef3a84a80c0658d9b32590ead90862f41b6a36b.jpg)
- వైసీపీని వీడనున్న చీరాల నేత
- పార్టీలోకి ఆమంచి రాకపై వ్యతిరేకం
- నేడో, రేపో టీడీపీలో చేరిక
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిన వేళ.. ఆయన రాకను తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న వైసీపీ ఇన్‌చార్జి యడం బాలాజీ పార్టీ వీడనున్నట్టు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం ఆయన చంద్రబాబును కలవడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. త్వరలోనే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు.
బాలాజీ ఆదివారం అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేశారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన కొందరు నేతలు ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబును కలిసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన చేరికకు చంద్రబాబు కూడా సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం.