Papri Benerji: పుల్వామా ఘటనపై పోస్ట్ పెట్టిన మహిళా ప్రొఫెసర్ పప్రి బెనర్జీ అరెస్ట్

  • గువాహటిలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పప్రి
  • ఇండియన్ ఆర్మీ దారుణాలకు పాల్పడుతోందంటూ పోస్ట్
  • సస్పెండ్ చేసిన కాలేజీ యాజమాన్యం

పుల్వామా ఘటనతో దేశం మొత్తం చలించిపోయింది. జవానుల పట్ల జరిగిన దారుణాన్ని నిరసిస్తూ సోషల్ మీడియా హోరెత్తింది. ఈ ఘటనపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ నేడు అరెస్ట్ అయ్యారు. గువాహటిలోని ఓ జూనియర్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న పప్రి బెనర్జీ మొదట పుల్వామా దాడిని ఖండించారు కానీ, అనంతరం కశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ దారుణాలకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాలేజీ యాజమాన్యం ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు శనివారం ప్రకటించింది. నేడు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

Papri Benerji
Asst Proffecer
Gowhati
Kashmir
Indian Army
  • Loading...

More Telugu News