DS Deekshitulu: ‘మురారి’ ఫేమ్ దీక్షితులు మృతి
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-550fc1e8e7f361ab04d1ee34ae7e90686fdf8131.jpg)
- రంగస్థల నటుడు, అధ్యాపకుడిగా పేరు గడించారు
- రంగస్థల కళలో ఎంఏ డిగ్రీ
- సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు
ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు డీఎస్ దీక్షితులు (63) నేడు మృతి చెందారు. ‘మురారి’ చిత్రం ద్వారా ఆయన నటుడిగా పేరుతెచ్చుకున్నారు. ఆ చిత్రంలో మురారి (మహేశ్ బాబు)ని రక్షించే క్రమంలో పూజలు చేస్తూ కనిపిస్తారు. ఇంద్ర, ఠాగూర్, ప్రాణం, వర్షం, అతడు తదితర చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్రలు పోషించారు. అలాగే ఆయన రంగస్థల నటుడిగానూ, అధ్యాపకుడిగానూ మంచి పేరు గడించారు. జూలై 28, 1956లో జన్మించిన దీక్షితులు రంగస్థల కళలో తెలుగు, సంస్కృత భాషల్లో ఎంఏ డిగ్రీలు పొందారు. దీక్షితులు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.