Chandrababu: లోటస్ పాండ్ నుంచే వైసీపీ ఆపరేషన్‌లు చేస్తోంది: చంద్రబాబు

  • పార్టీని వీడిన వారిని చిత్తుగా ఓడించండి
  • నిధులివ్వకున్నా పోలవరం పూర్తి చేస్తాం
  • రాష్ట్రానికి న్యాయం చేయడం మోదీకి ఇష్టం లేదు

సీట్లు రావనే భయంతోనే పార్టీ మారుతున్నారంటూ, తాజాగా తమ పార్టీని వీడిన వారిపై సీఎం చంద్రబాబు కామెంట్ చేశారు. నేడు కొండవీడు కోట ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన.. అవంతి, రవీంద్రబాబు టీడీపీ నుంచి వెళ్లిపోవడంపై స్పందించారు. లోటస్‌పాండ్‌ నుంచే రాష్ట్రంపై వైసీపీ ఆపరేషన్‌లు చేస్తోందని విమర్శించారు. ప్రజల్ని మోసం చేయొచ్చని వైసీపీలోకి వెళుతున్నారని ఎద్దేవా చేశారు.

ప్రజల ఆమోదం పొందిన వారికే టికెట్లు కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారు. పార్టీని వీడి వెళ్లిపోయిన నేతలను చిత్తుగా ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నిధులివ్వకున్నా జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. 69 ప్రాజెక్టుల్లో 19 ఇప్పటికే పూర్తి చేశామన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయడం ప్రధాని మోదీకి ఇష్టం లేదని మండిపడ్డారు. తెలంగాణలో ఆదాయం ఉందని.. కానీ ఏపీలో ఉన్నంత అభివృద్ధి లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

Chandrababu
Telugudesam
Narendra Modi
YSRCP
Avanthi Srinivas
Ravindra babu
  • Loading...

More Telugu News