KCR: రేపే మంత్రుల ప్రమాణ స్వీకారం.. ఇప్పటికే కొందరికి కేసీఆర్ నుంచి ఫోన్ కాల్స్

  • ఐదుగురు కొత్తవారికి ఛాన్స్
  • 9 మంది ప్రమాణ స్వీకారం
  • కేసీఆర్, కేటీఆర్‌‌తో భేటీ

గత కొన్ని రోజులుగా తెలంగాణలో అందరిలోనూ కుతూహలాన్ని రేకెత్తిస్తున్న మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి సమయం దగ్గరపడింది. రేపు ఉదయం 11:30 గంటలకు మొత్తంగా తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. వీరిలో ఐదుగురు కొత్తవారికి అవకాశం దక్కనుంది.

ఇక రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారికి ఇప్పటికే సీఎం కేసీఆర్ నుంచి ఫోన్ కాల్స్ వెళుతున్నాయి. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.  

KCR
KTR
Pragathi Bhavan
Thalasani
Errabelli
Niranjan Reddy
Koppula Eshwar
Prashanth Reddy
Jagadeesh Reddy
  • Loading...

More Telugu News