Telangana: మూడేళ్లుగా భరత్ నన్ను వేధిస్తున్నాడు.. బాధిత విద్యార్థిని మధులిక వాంగ్మూలం

  • భరత్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం
  • అతని ప్రేమను నిరాకరించడంతో వేధింపులకు దిగాడు
  • మూడు నెలల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి

ప్రేమోన్మాది భరత్ దాడిలో గాయపడి కోలుకుంటున్న విద్యార్థిని మధులిక వాంగ్మూలం ఇచ్చింది. మేజిస్ట్రేట్ సమక్షంలో ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. భరత్ తనకు చిన్నప్పటి నుంచి పరిచయం అని, ఒకే కాలనీలో తాము నివసిస్తుండటంతో అతనితో మాట్లాడే దానినని చెప్పింది. భరత్ తనపై ఇంత కోపం పెట్టుకుంటాడని కలలో కూడా అనుకోలేదని, మూడేళ్లుగా ప్రేమ పేరుతో భరత్ తనను వేధిస్తున్నాడని, అందుకు నిరాకరించిన తనపై వేధింపులకు దిగాడని పేర్కొంది. మూడు నెలల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పానని, షీ టీమ్, భరోసా సెంటర్ ను ఆశ్రయించామని చెప్పింది. పోలీసుల కౌన్సిలింగ్ తో భరత్ మారతాడనుకున్నాను కానీ, తనపై ఇంత కోపం పెంచుకుంటాడని ఊహించలేదని తన వాంగ్మూలంలో మధులిక తెలిపింది.

Telangana
Hyderabad
bharath
madhulika
  • Loading...

More Telugu News